ఓటీటీలోకి నాని కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!
- నెట్ ఫ్లిక్స్ లోకి సరిపోదా శనివారం మూవీ
- ఈ నెల 26 నుంచి తెలుగు సహా వివిధ భాషల్లో ప్రసారం
- అధికారికంగా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్
నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపుదిద్దుకున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించారు. ఎస్ జే సూర్య ప్రత్యేక పాత్రలో కనిపించాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తెరకెక్కించింది. గత నెలాఖరున (ఆగస్టు 29న) థియేటర్లలో విడుదలైన సరిపోదా శనివారం భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలియడంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.