Samsung Galaxy s 24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై భారీ తగ్గింపు... వివరాలు ఇవిగో!

samsung galaxy s24 price temporarily drops under rs 60000 amazon offers lower price ahead of sale

  • శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 వాస్తవ ధర రూ.74,999లు
  • ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.24,250లకే 
  • ఈ నెల 27 నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

సెల్ ఫోన్ వినియోగదారులకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా భారీ డిస్కౌంట్ తో తన గెలాక్సీ ఎస్ 24 ఫోన్ అందించేందుకు సిద్ధమైంది. ఫెస్టివల్ ప్రమోషన్ ప్రైస్ కింద ధర తగ్గిస్తున్నట్లు శుక్రవారం సంస్థ తెలిపింది. కంపెనీ వెస్ సైట్, ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్స్ లో రూ.60వేల లోపు ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. 

గత జనవరిలో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999లు కాగా, ఇప్పుడు రూ.59,999లకే లభిస్తుంది. బ్యాంక్ ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ రూ.12వేలతో పాటు అప్ గ్రేడ్ బోనస్ రూ.3వేలతో ధర తగ్గుతుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద రూ.40వేల వరకూ శాంసంగ్ రాయితీ అందిస్తోంది. 
 
ప్రస్తుతం అమెజాన్ లిస్టింగ్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ రూ.57,490లు పలుకుతోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.24,250లకే సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతోంది. 

Samsung Galaxy s 24
Amazon offers
Business News
  • Loading...

More Telugu News