రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులపై బీఆర్ఎస్ కమిటీ వేసిన కేటీఆర్

KTR constitute committee on hospitals
  • రాజయ్య నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ
  • కమిటీలో రాజయ్యతో పాటు డాక్టర్ సంజయ్, డాక్టర్ ఆనంద్
  • ఆసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులు దిగజారిపోయాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్గురితో పార్టీ కమిటీని నియమించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులను ఈ బీఆర్ఎస్ కమిటీ సందర్శించి ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో రాజయ్యతో పాటు డాక్టర్ సంజయ్, డాక్టర్ ఆనంద్ మెతుకు ఉన్నారు.

ఈ మేరకు బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య ఆరోగ్య పరిస్థితుల పతనంపై బీఆర్ఎస్ ఒక నిజనిర్ధారణ, అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ మేరకు కేటీఆర్ ఒక ప్రకటనను విడుదల చేశారని వెల్లడించింది.

పార్టీ ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య తో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఉంటారని ఆ ట్వీట్ లో పేర్కొంది.

డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో ఈ కమిటీ... గాంధీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందని వివరించింది.
Go Back to Shorts
KTR
Dr Rajaiah
BRS
Gandhi Hospital

More Telugu News