Tirupati Laddu: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలకలం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్

YCP Approached High Court on Tirupathi Laddu Controversy
  • దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం
  • లంచ్ మోషన్ పిటిషన్ వేసిన వైసీపీ
  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోర్టుకు విన్నపం
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్ ఉండి ఉండవచ్చనే  రిపోర్ట్ కలకలం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వం దారుణానికి పాల్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం, గత టీటీడీ యాజమాన్యంపై అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దేవుడి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. వాస్తవాల నిగ్గుతేల్చాలని... ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... వచ్చే బుధవారం పిటిషన్ పై వాదనలు వింటామని తెలిపింది.  


Tirupati Laddu
YSRCP
AP High Court

More Telugu News