తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలకలం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్
- దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం
- లంచ్ మోషన్ పిటిషన్ వేసిన వైసీపీ
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోర్టుకు విన్నపం
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దేవుడి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. వాస్తవాల నిగ్గుతేల్చాలని... ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... వచ్చే బుధవారం పిటిషన్ పై వాదనలు వింటామని తెలిపింది.