Naga Babu: జానీ మాస్ట‌ర్ అరెస్ట్‌... నాగ‌బాబు ఆస‌క్తిక‌ర‌ ట్వీట్స్‌!

Naga Babu Interesting Tweet goes Viral on Social Media
 
అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్ర‌ముఖ‌ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన నేత‌, మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టులు పెట్టారు. ఈ మేర‌కు ఆయ‌న ఇద్ద‌రు ప్ర‌ముఖుల కొటేష‌న్ల‌తో రెండు ట్వీట్లు చేశారు. 

"చ‌ట్ట ప్ర‌కారం నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు" అనే సర్ విలియం గారో కోట్‌ను పోస్ట్ చేశారు. 

అలాగే "మీరు వినేదే న‌మ్మొద్దు. ప్ర‌తి క‌థ‌కు మూడు కోణాలు ఉంటాయి... మీది, అవ‌త‌లి వారిది, నిజానిది" అనే రాబ‌ర్ట్ ఇవాన్స్ కోట్‌ను కూడా ట్వీట్ చేశారు. 

దీంతో జానీ మాస్ట‌ర్‌కు మ‌ద్ద‌తుగా నాగ‌బాబు ఈ పోస్టులు చేశార‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు అత్యాచార కేసు న‌మోదు కావ‌డంతో జానీపై జ‌న‌సేన పార్టీ వేటు వేసిన విష‌యం తెలిసిందే.
Naga Babu
Janasena
Jani Master

More Telugu News