తాళం పగలగొట్టుకుని బోను నుంచి బయటకు వచ్చిన పులి.. ఒళ్లు జలదరించే వీడియో ఇదిగో!
- బోను లోపల ఉన్న పులి బయటకు వచ్చే ప్రయత్నం
- తాళంకప్పను నోట్లో పెట్టుకుని దానిని బలంగా లాగిన పులి
- బోను తలుపును కాలితో లాగి చూసిన వైనం
ఈ వీడియోపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. పులికి ఉన్న శక్తిని చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తోందని ఒక యూజర్ కామెంట్ చేస్తే.. ప్రకృతిలో ఇంత బలముందా? అని ఇంకో యూజర్ ఆశ్చర్యపోయాడు. పులులు ఎంత భయంకరమైనవో మరోమారు తెలిసి వచ్చిందని ఇంకో యూజర్ రాసుకొచ్చాడు. పులి బోనులో ఉంది కదా.. అని ఇకపై నిశ్చింతగా ఉండడానికి వీల్లేదని మరో వ్యక్తి భయం వ్యక్తం చేశాడు. అసలు పులులను ఇలా చిన్న బోనులలో ఉంచాలనుకోవడమే మూర్ఖత్వమని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో చూస్తే మీరేమంటారో?