MPax: భారత్‌లో మరో ఎంపాక్స్ కేసు నమోదు

Second Mpox case confirmed in India
  • యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ళ వ్యక్తికి ఎంపాక్స్
  • ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలిపిన కేరళ మంత్రి వీణాజార్జ్
  • వ్యాధి లక్షణాలు కనిపించడంతో శాంపిల్ తీసుకొని పరీక్షలకు పంపిన డాక్టర్లు
భారత్‌లో రెండో ఎంపాక్స్ కేసు నమోదయింది. యూఏఈ నుంచి ఇటీవల వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ కేసు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

బాధితుడు ఇప్పటికే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. అతనికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో శాంపిల్ తీసుకొని పరీక్షలకు పంపించినట్లు చెప్పారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు.

విదేశాల నుంచి వచ్చే వారితో సహా ఏవైనా లక్షణాలు ఉన్నవారు తమకు సమాచారం అందించి, సాధ్యమైనంత త్వరగా చికిత్సను పొందాలని సూచించారు. యూఏఈ నుంచి వచ్చిన సదరు వ్యక్తి కూడా తనకు వ్యాధి లక్షణాలు ఉన్నాయని గుర్తించాడని, అతను తన కుటుంబానికి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిపారు. అతను ప్రస్తుతం మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఉన్నట్లు తెలిపారు.
MPax
India
Kerala

More Telugu News