Reliance Jio: రీచార్జ్ ప్లాన్లను అప్‌డేట్ చేసిన జియో.. రూ. 91 ప్లాన్ ప్రత్యేకంగా వారి కోసం మాత్రమే!

Jio customers as company launches new plan with unlimited calling and data
  • అప్‌డేట్ చేసిన ప్లాన్లు అన్నీ 28 రోజుల కాలపరిమితివే
  • అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాల్లో లేని మార్పు
  • జియో ఫోన్ యూజర్ల కోసం కొత్తగా రూ. 91 ప్లాన్
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో తన రీచార్జ్ ప్లాన్లను అప్‌డేట్ చేసింది. 28 రోజుల కాలపరిమితితో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్సెమ్మెస్ సౌకర్యంతోపాటు జియో యాప్స్ ప్రయోజనాలు కూడా వీటితో లభిస్తాయి. జియో ఫోన్ యూజర్ల కోసం కొత్తగా రూ. 91 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌తో పాటు  రూ.449, రూ. 448, రూ. 399, రూ. 349, రూ.329 ప్లాన్లను అప్‌డేట్ చేసింది. 

రూ. 449 ప్లాన్: 28 రోజుల కాలపరిమితితో లభించే ఈ ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు రూ. 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. హైస్పీడ్ డేటాను వాడేసుకున్న తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ ప్లాన్‌లో జియో యాప్స్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 

రూ.448 రీచార్జ్ ప్లాన్: ఇందులో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు మామూలే. ఇందులో 12 ఓటీటీ యాప్స్ కు యాక్సెస్ లభిస్తుంది. వీటిలో జియో టీవీ, సోనీలివ్, జీ5 వంటివి ఉన్నాయి. కాలపరిమితి సేమ్.. 28 రోజులు. 

జియో రూ. 399 ప్లాన్: ఇందులోనూ కాలపరిమితి 28 రోజులే. రోజుకు రూ. 2.5 జీబీ డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు మామూలే. జియో యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.  

జియో రూ.349 (హీరో 5జీ) ప్లాన్: హీరో5జీ ప్లాన్‌గా పిలిచే ఇందులో రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్సెస్‌లు 28 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. జియో యాప్స్ సౌకర్యం ఉండనే ఉంది. 

రూ. 329 రీచార్జ్ ప్లాన్: ఇందులో రోజుకు రూ. 1.5 జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. వాయిస్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు మామూలే. అదనంగా జియో యాప్స్, జియో క్లౌడ్, జియో సావన్ ప్రొ యాక్సెస్ లభిస్తుంది. అయితే, జియో సినిమా యాక్సెస్ లభించదు. 

జియో రూ.91 రీచార్జ్ ప్లాన్: దీనిని ప్రత్యేకంగా జియోఫోన్ యూజర్ల కోసం తీసుకొచ్చారు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, 50 ఎస్సెమ్మెస్‌లు, 100 ఎంబీ డైలీ డేటా లభిస్తుంది. జియో యాప్స్‌ను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను మై జియో యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Reliance Jio
Jio
Recharge Plans
Prepaid Plans

More Telugu News