KTR: రేవంత్ రెడ్డికి ఎవరైనా ఆ విషయాన్ని గుర్తు చేయండి: కేటీఆర్ చురక

KTR satire on CM Revanth Reddy
  • రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని గుర్తు చేయాలన్న కేటీఆర్
  • ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి విమానం ఎక్కే పనిలో ఉన్నారని ఎద్దేవా
  • వరదలతో వట్టెం పంప్ హౌస్‌లో బాహుబలి మోటార్లు మునిగిపోయాయని వెల్లడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డ తన విధులను విస్మరిస్తున్నారని, ఈ విషయాన్ని ఆయనకు ఎవరైనా గుర్తు చేయండని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ వైపు కంప్యూటర్ల మూలాలను కనిపెట్టడం, తిరిగి వాటిని ఆవిష్కరించడంలో బిజీగా ఉన్నప్పటికీ, ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా చేశారు.

ఇటీవల సెప్టెంబర్ 3న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) వట్టెం పంప్ హౌస్‌లో వరదలు వచ్చాయని, దీంతో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. వరదల కారణంగా ఇక్కడి బాహుబలి మోటార్లు నీట మునిగాయని వెల్లడించారు. ఇక్కడ మరో 18 మీటర్ల మేర నీటిని తక్షణమే తొలగించాల్సి ఉందన్నారు.

ముఖ్యమంత్రి గారూ... తెలంగాణకు, రైతులకు ముఖ్యమైన వాటిని నాశనం చేసేందుకు మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారో సమాధానం చెప్పండని ప్రశ్నించారు.
KTR
Revanth Reddy
Telangana

More Telugu News