ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ పుట్టినరోజు శుభాకాంక్షలు
- నేడు ప్రధాని 74వ పుట్టిన రోజు
- మోదీతో కరచాలనం చేస్తున్న ఫొటోను షేర్ చేసిన మెలోనీ
- భారత్, ఇటలీ మధ్య స్నేహం, సహకారం కొనసాగాలని ఆకాంక్షించిన మెలోనీ
మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెలోనీ... ఆయనతో గతంలో కరచాలనం చేసిన ఫొటోను షేర్ చేశారు. భారత్, ఇటలీ మధ్య స్నేహం, సహకారం ఇలాగే కొనసాగాలని, ప్రపంచ సవాళ్లను కలిసి ఎదుర్కోవాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణంలో జన్మించారు. జూన్ 9న మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేశారు.