Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ పుట్టినరోజు శుభాకాంక్షలు

Italy PM Giorgia Meloni Wishes PM Modi On His 74th Birthday
Advertisement
  • నేడు ప్రధాని 74వ పుట్టిన రోజు 
  • మోదీతో కరచాలనం చేస్తున్న ఫొటోను షేర్ చేసిన మెలోనీ
  • భారత్, ఇటలీ మధ్య స్నేహం, సహకారం కొనసాగాలని ఆకాంక్షించిన మెలోనీ
Advertisement
ప్రధాని నరేంద్రమోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆమె ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. 47 ఏళ్ల జార్జియా మెలోని 2022 అక్టోబర్ నుంచి ఇటలీ ప్రధానిగా కొనసాగుతున్నారు.

మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెలోనీ... ఆయనతో గతంలో కరచాలనం చేసిన ఫొటోను షేర్ చేశారు. భారత్, ఇటలీ మధ్య స్నేహం, సహకారం ఇలాగే కొనసాగాలని, ప్రపంచ సవాళ్లను కలిసి ఎదుర్కోవాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణంలో జన్మించారు. జూన్ 9న మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేశారు.
Advertisement
Advertisement
Narendra Modi
Italy
India
BJP

More Telugu News