వేలంలో రూ. 1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ.. ఎక్కడంటే!
- గణేశ్ లడ్డూ వేలంపాటలో గత రికార్డు బద్దలు
- కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో రూ. 1.87 కోట్లు పలికిన లడ్డూ
- గత ఏడాది కంటే రూ. 67 లక్షల అధిక ధర
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఏకంగా రూ. 1.87 కోట్లకు లడ్డూ అమ్ముడుపోయింది. గత ఏడాది ఇక్కడి లడ్డూ రూ. 1.20 కోట్లు పలికింది. ఈ ఏడాది ఏకంగా రూ. 67 లక్షల మేర పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.