HMSI: హోండా ప్రీమియం బైకుల్లో లోపాలు... వెనక్కి పిలిపిస్తున్న సంస్థ

hmsi recalls 300 350 cc bikes to replace faulty parts
  • రీకాల్ చేబట్టిన వాటిలో సీబీ 300 ఎఫ్, సీబీ 300ఆర్, సీబీ 359, హెచ్‌నెస్ 350, సీబీ 350 ఆర్ఎస్ మోడళ్లు  
  • లోపాలు గుర్తించిన కారణంగా పార్టులను ఉచితంగా రీప్లేస్ చేస్తున్నట్లు వెల్లడి
  • అన్ని బిగ్ వీల్ డీలర్ షిప్ కేంద్రాల్లోనూ రీప్లేస్‌మెంట్ ప్రక్రియ 
ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పలు మోడళ్ల బైక్‌లను రీకాల్ చేపట్టింది. కంపెనీ 300 – 350 సీసీ బైక్‌ల రీకాల్ చేపట్టింది. ఈ మేరకు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. స్పీడ్ సెన్సర్ క్యామ్ షార్ట్‌లో లోపాల మూలంగా ఈ రీకాల్ చేపడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

సీబీ 300 ఎఫ్, సీబీ 300ఆర్, సీబీ 359, హెచ్‌నెస్ 350, సీబీ 350 ఆర్ఎస్ మోడళ్లు రీకాల్ చేపట్టిన వాటిలో ఉన్నాయి. 2020 అక్టోబర్ నుండి 2024 ఏప్రిల్ మధ్య తయారైన వారిలో ఈ మోడళ్లు ఉన్నాయి. మోల్డింగ్ విధానంలో పొరపాటు కారణంగా స్పీడ్ సెన్సర్ లోకి నీరు చొరబడే అవకాశం ఉందని, దీని వల్ల స్పీడ్ సెన్సర్ తో పాటు ట్రాక్షన్ లేదా ఏబీఎస్ కూడా పనిచేయక పోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని సందర్భాల్లో బ్రేకింగ్ లోనూ లోపాలు రావచ్చని వెల్లడించింది. 

అదే విధంగా 2024 జూన్, జులై మధ్య తయారైన సీబీ 350, హెచ్‌నెస్ సీబీ 350, సీబీ 350 ఆర్ఎస్ మోడళ్లలో క్యామ్ షార్ట్‌లో పని తీరులో కూడా లోపం ఉన్నట్లు గుర్తించామని కంపెనీ పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యగా సంబంధిత పార్టులను ఉచితంగా రీప్లేస్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. వారంటీతో సంబంధం లేకుండా కంపెనీకి చెందిన అన్ని బిగ్ వీల్ డీలర్ షిప్ కేంద్రాల్లో ఈ రీప్లేస్‌మెంట్ ప్రక్రియ చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.
HMSI
Honda 300cc
Honda 350cc Bikes
Business News

More Telugu News