Terrorist escape: పారిపోయేందుకు ప్రయత్నించిన టెర్రరిస్టు.. డ్రోన్ వీడియో ఫుటేజీ వైరల్

Terrorist Runs For Cover In Jammu and Kashmir Shot Dead By Security Forces
  • కాల్పులు జరుపుతూ ఇంట్లో నుంచి బయటకు పరుగు
  • ఎదురు కాల్పులు జరిపి మట్టుబెట్టిన భద్రతాబలగాలు
  • శ్రీనగర్ లోని బారాముల్లాలో శనివారం ఎన్ కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టుల హతం
జమ్మూకశ్మీర్ లోని బారాముల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించి ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. టెర్రరిస్టు కదలికలను స్పష్టంగా చిత్రీకరించిన ఈ వీడియో ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బారాముల్లాలో శనివారం రాత్రంతా జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి.

ఓ ఇంట్లో టెర్రరిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందడంతో భద్రతాబలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే, వీరిని గమనించిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లాయి. దీంతో వెనక్కి తగ్గిన టెర్రరిస్టులు పారిపోయేందుకు ప్రయత్నించారు. బిల్డింగ్ లో నుంచి బయటకు వచ్చి వెనక వైపు ఉన్న చెట్లలోకి పరిగెడుతున్న ఓ టెర్రరిస్టు పైకి సోల్జర్లు కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ తాకడంతో కిందపడ్డప్పటికీ టెర్రరిస్ట్ లొంగిపోలేదు. కాల్పులు జరుపుతూ అలాగే పాక్కుంటూ పారిపోవడానికే ప్రయత్నించాడు. దీంతో సైనికులు కూడా కాల్పులు జరిపి ఆ టెర్రరిస్టును మట్టుబెట్టారు.
Terrorist escape
Baramulla
Drone video
Jammu And Kashmir
Viral Videos

More Telugu News