రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం
- సిరోహి జిల్లా పిండ్వారాలో ఘోరం
- మరో పదిమందికి తీవ్ర గాయాలు
- పలువురి పరిస్థితి విషమం
సిరోహి జిల్లా పిండ్వారా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదానికి కారణం తుఫాన్ డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి కూడా వున్నారని తెలిపారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉందని సిరోహి ఎస్పీ మీడియాకు వెల్లడించారు.