ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న బోట్ల వెలికితీత ప్రక్రియ
- మూడో రోజుకు చేరుకున్న వెలికితీత ప్రక్రియ
- బోట్లకు ఇనుప రోప్‌లు కట్టి బయటకు లాగే ప్రయత్నం
- మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా 20 మీటర్లు మాత్రమే కదిలిన పడవలు
గేట్లను ఢీకొని ఆగిపోయిన బోట్లను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వాటిని ముక్కలు చేసి తొలగించే ప్రయత్నం చేయగా అది కూడా ఫలించలేదు. దీంతో కాకినాడ అబ్బులు బృందం బోట్లకు ఇనుప రోప్‌లు కట్టి పొక్లెయిన్లతో పైకి లాగుతోంది. మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా బోటు 20 మీటర్లు మాత్రమే కదిలింది. బోట్లు ఇసుకలో కూరుకుపోవడంతో తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది.