Divi's Laboratories: సీఎం రేవంత్ రెడ్డికి రూ.5 కోట్ల విరాళం చెక్ అందించిన డాక్టర్ కిరణ్

Divis Laboratories CEO Dr Kiran handed Rs 5 crore cheque to CM Revanth Reddy
  • తెలంగాణలో వరద బీభత్సం
  • 29 మంది మృతి
  • వేలాదిగా ప్రజలు నిరాశ్రయులైన వైనం
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇటీవల వరదలు సంభవించి, జనజీవనాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. ముఖ్యంగా, ఖమ్మం పట్టణం వరద బీభత్సానికి గురై అస్తవ్యస్తంగా మారింది. దాదాపు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 

ఈ నేపథ్యంలో, వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు వస్తున్నాయి. దివీస్ ల్యాబొరేటరీస్ కూడా రూ.5 కోట్ల భారీ విరాళంతో ముందుకు వచ్చింది. 

ఇవాళ దివీస్ ల్యాబొరేటరీస్ సీఈవో డాక్టర్ కిరణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. సీఎంని కలిసి విరాళం తాలూకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు.
Divi's Laboratories
Dr Kiran
Revanth Reddy
Floods
CM Relief Fund
Hyderabad
Telangana

More Telugu News