Vinesh Phogat: ఈ తీర్పును సవాల్ చేయడానికి వినేశ్ ఫొగాట్ ముందుకు రాలేదు: హరీశ్ సాల్వే

Vinesh Phogat didnt want to challenge sports court verdict Lawyer Harish Salve
  • పారిస్ ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకం కోల్పోయిన వినేశ్ ఫొగాట్
  • అధిక బరువు కారణంగా ఫైనల్‌లో అనర్హత వేటు
  • కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అనుకూలంగా రాని తీర్పు
కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పును సవాల్ చేయడానికి వినేశ్ ఫొగాట్ ముందుకు రాలేదని ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ అధిక బరువు కారణంగా పతకం కోల్పోయారు. దీనిని సీఏఎస్ కోర్టులో సవాల్ చేశారు. ఫైనల్ వరకు వచ్చిన తనకు ఉమ్మడిగా రజత పతకం ఇవ్వాలని ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఆర్బిట్రేషన్ కోర్టు విచారణ జరిపింది. అయితే తీర్పు ఆమెకు అనుకూలంగా రాలేదు.
Vinesh Phogat
Harish Salve
Sports News

More Telugu News