పైడితల్లి జాతరకు చంద్రబాబును ఆహ్వానించిన అప్పలనాయుడు
- ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిసిన ఎంపీ అప్పలనాయడు
- పైడితల్లి జాతర ఆహ్వానపత్రం అందించిన ఎంపీ
- అమ్మవారిని భువనేశ్వరి దర్శించుకున్న రోజే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని వ్యాఖ్య
ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ... పైడితల్లిని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి దర్శించుకున్న రోజునే చంద్రబాబుకు బెయిల్ లభించిందని చెప్పారు. విజయవాడ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఎంతో అంకితభావంతో సేవ చేశారని... ఆయన సేవలకు ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందని అన్నారు. టెక్నాలజీ సహకారంతో విపత్తులను ఎలా ఎదుర్కోవచ్చో చంద్రబాబు చేసి చూపించారని కొనియాడారు.