తన హావభావాలతో నవ్వులు పూయించిన జగన్... వీడియో ఇదిగో!
- పిఠాపురం నియోజకవర్గంలో జగన్ పర్యటన
- కూటమి ప్రభుత్వంపై వ్యంగ్యం
- తల్లికి వందనం, మహాలక్ష్మి పథకాల నేపథ్యంలో సెటైర్లు
ఈ సందర్భంగా తన హావభావాలతో జగన్ నవ్వులు పూయించారు. చిట్టి తల్లీ ఇటు రామ్మా... నీకు పదిహేను వేలు, నీ తమ్ముడికి పదిహేను వేలు, నీ చెల్లెలికి పదిహేను వేలు... సంతోషమా అని చంద్రబాబు చెప్పేవారని జగన్ వ్యంగ్యం ప్రదర్శించారు.
అదే జగన్ అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని, చంద్రబాబు మాత్రం సూపర్-6లో మాత్రమే చెబుతాడని జగన్ విమర్శించారు. పిల్లలను, అక్కచెల్లెమ్మలను మోసం చేశాడని అన్నారు.
ఇక, పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరును కూడా జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రభుత్వం ఫొటోలకు మాత్రమే పరిమితవుతోందని విమర్శించారు.
"చంద్రబాబు అనే వ్యక్తి పూర్తిగా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు. పవన్ కల్యాణ్ సినిమాల్లోనే స్టార్... ఇక్కడ కాదు. పాపం, ఆయన కొత్తగా వచ్చాడు... ఆయనకేమీ తెలియదు. కానీ చంద్రబాబు మాత్రం పవన్ కల్యాణ్ ను మించిపోయాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్" అని జగన్ వ్యాఖ్యానించారు.
నిమ్మల రామానాయుడు డైలాగ్ ను పిల్లలు, మహిళలు తో పేరడీ చేసిన వైఎస్ జగన్!#NimmalaRamanaidu #TDP #YSJagan #YSRCongressParty #Pithapuram #NTVTelugu pic.twitter.com/UdjRg34cUb
— NTV Telugu (@NtvTeluguLive) September 13, 2024