Nandigam Suresh: నందిగం సురేశ్ కు పోలీస్ కస్టడీ విధించిన మంగళగిరి కోర్టు

Mangalagiri Court allows Nandigam Suresh for Police Custody
  • టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగం అరెస్ట్
  • ప్రస్తుతం గుంటూరు జిల్లాలో జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ
  • నందిగం సురేశ్ ను జైలులోనే విచారించనున్న పోలీసులు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు మంగళగిరి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్ ను ఇటీవల మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, మంగళగిరి కోర్టు నందిగం సురేశ్ ను రెండ్రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం నందిగం సురేశ్ గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు జైలులోనే విచారించనున్నారు. 

ఈ కేసులో నందిగం సురేశ్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. నందిగం సురేశ్ ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Nandigam Suresh
Police Custody
Mangalagiri Court
TDP Office
YSRCP

More Telugu News