చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎనిమిది మంది దుర్మరణం
- రెండు లారీలను ఢీకొన్న బస్సు
- మొగిలి ఘాట్ వద్ద ప్రమాదం
- బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతుండగా యాక్సిడెంట్
బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతుండగా మొగిలి ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.