Hero Sudheer Babu: తన తండ్రి నాగేశ్వరరావు గురించి చెప్పిన హీరో సుధీర్ బాబు

sudheer babu speech at maa nanna super hero teaser launch event
  • హైదరాబాద్ లో ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ టీజర్ లాంచ్
  • తన తండ్రి నాగేశ్వరరావు గురించి చెబుతూ భావోద్వేగానికి గురైన హీరో సుధీర్ బాబు
  • నాలుగేళ్లలో తన కుమారుడు చరిత్ నటుడిగా తెరంగేట్రం చేయనున్నాడని సుధీర్ బాబు వెల్లడి
హైదరాబాద్ లో గురువారం హీరో సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. సుధీర్ బాబు ప్రధాన పాత్రలో అభిలాష్‌రెడ్డి కంకర తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ విడుదల వేడుక కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు తన తండ్రి నాగేశ్వరరావు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. సినీ పరిశ్రమకు తాను వెళ్తానని చెప్పినప్పుడు ఆయన గుండె ముక్కలయిందని అన్నాడు. అదృష్టవశాత్తు ఇండస్ట్రీలో ఓ స్థానం దక్కించుకోగలిగానని, అందుకు నాన్న హ్యాపీ అని సుధీర్ బాబు పేర్కొన్నాడు. 

తన తండ్రిపై ఎంతో ప్రేమ ఉన్నా ఎప్పుడూ 'ఐ లవ్ యూ' అని చెప్పలేదని, హగ్ కూడా చేసుకోలేదని అన్నారు. ఆయనను ఆలింగనం చేసుకోవాలని ఇప్పటికీ అనిపిస్తుంటుందని, కానీ చేసుకోలేనని అన్నారు. అందుకే మా అబ్బాయిలను హగ్ చేసుకుంటుంటా అని సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. తన తండ్రి కష్టపడే మనస్తత్వం గురించి, తన కుమారుడు చరిత్ తెరంగేట్రం గురించి కూడా ఈ సందర్భంగా సుధీర్ బాబు వెల్లడించాడు. తన కుమారుడు చరిత్ నాలుగేళ్లలో నటుడిగా తెరంగేట్రం చేయనున్నాడని, తాము వద్దని వారించినా వినేలా లేడని చెప్పుకొచ్చాడు.
Hero Sudheer Babu
Movie News

More Telugu News