bike birthday: బైక్​ తో కేక్​ కట్​ చేయించి బర్త్​ డే చేశాడు.. వైరల్​ వీడియో ఇదిగో!

man celebrates bike birthday with cake in viral video
  • బైక్ ముందు టైరుకు కత్తిని అతికించి కేక్ కటింగ్
  • ‘ఎక్స్’లో వైరల్ గా మారిన వీడియో..
  • ఇదేం చిత్రమో అంటూ నెటిజన్ల స్పందన
చాలా మంది గ్రాండ్ గా పుట్టిన రోజులు చేసుకుంటారు. కొందరు తాము పెంచుకునే కుక్కలు, పిల్లులు, ఆవులు, ఇతర జంతువులకూ పుట్టిన రోజులు జరుపుతుండటం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం.. ఓ వ్యక్తి బైక్ కు బర్త్ డే చేశాడు. ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

బైక్ తోనే కేక్ కట్ చేయించి...

బైక్ ను పూల దండలతో అలంకరించారు. దాని ముందు టైర్ కు ప్లాస్టిక్ కత్తిని టేపుతో అతికించారు. బైక్ ను కదిలిస్తే.. ఆ టైర్ కు అతికించిన కత్తి కిందికి వచ్చేలా చేశారు. ఓ వ్యక్తి కేక్ ను బైక్ ముందు టైర్ వద్ద పెట్టగా.. మరో వ్యక్తి బైక్ ను కాస్త ముందుకు వెనక్కి కదిలించారు. అలా టైర్ కు అమర్చిన కత్తితో కేకును కట్ చేశారు.
  • ఇంతేకాదు... ఆ బైక్ యజమాని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల పిల్లలు కూడా అక్కడ చేరి... బైక్ కు హ్యాపీ బర్త్ డే చెప్పారు కూడా.
  • ట్విట్టర్ లోని ఓ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయగా.. విపరీతంగా వైరల్ అయింది. ఒక్కరోజులోనే పది లక్షలకుపైగా వ్యూస్, వేల కొద్దీ లైకులు వచ్చాయి.
  • కొందరేమో బైక్ పై ఆ వ్యక్తి ప్రేమ కనబడుతోందని కామెంట్ చేస్తే.. మరికొందరు ఇదేం చిత్రమో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
bike birthday
offbeat
Viral Videos
X Corp

More Telugu News