Natasa Stankovic: ముంబయిలో ల‌వ‌ర్‌తో క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టిన‌ హార్దిక్ మాజీ భార్య న‌టాషా... నెట్టింట వీడియో వైర‌ల్‌!

Hardik Pandya Ex Wife Natasa Stankovic with Boyfriend Aleksandar Ilac in Mumbai
  • బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండ‌ర్ ఇలాక్‌తో క‌నిపించిన‌ న‌టాషా స్టాంకోవిక్
  • ఈ క్ర‌మంలో ఓ జిమ్ వ‌ద్ద ఫొటోగ్రాఫ‌ర్ల‌కు పోజులిచ్చిన హార్దిక మాజీ భార్య‌
  • ఈ ల‌వ్ జంట‌ ముంబై వీధుల్లో తిరిగిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్
భార‌త స్టార్ క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య న‌టాషా స్టాంకోవిక్ దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత తాజాగా ముంబయి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండ‌ర్ ఇలాక్‌తో క‌లిసి ముంబయి వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టారు. 

ఇలా ఈ ల‌వ్ క‌పుల్‌ ముంబయి వీధుల్లో తిరిగిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. తెలుపు రంగు జాకెట్ వేసుకున్న న‌టాషా ఓ జిమ్ వ‌ద్ద ఫొటోగ్రాఫ‌ర్ల‌కు పోజులివ్వ‌డం వీడియోలో ఉంది. ఆ త‌ర్వాత తానే స్వ‌యంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. 

ఇక హార్దిక్, న‌టాషా ఇటీవ‌లే విడిపోయిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాంతో ఆమె త‌న కుమారుడు అగ‌స్త్య పాండ్యాను తీసుకుని సెర్బియా వెళ్లిపోయారు. రెండు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు ఇండియాకు తిరిగి వ‌చ్చారు. కాగా, స‌న్నిహ‌త వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం హార్దిక్‌ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే న‌టాషా అత‌ని నుంచి దూర‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.
Natasa Stankovic
Aleksandar Ilac
Hardik Pandya
Mumbai

More Telugu News