Pawan Kalyan: రేవంత్ రెడ్డితో సమావేశంపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan tweet on meeting with Revanth Reddy
  • ఇటీవల తెలంగాణ వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించిన పవన్
  • హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం
  • విరాళం తాలూకు చెక్ అందజేత
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ ఎంతో సుహృద్భావంగా సాగిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల, జల వనరుల సంరక్షణ పట్ల ఆయనకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని కితాబిచ్చారు. 

ప్రకృతి విపత్తు కారణంగా ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఇక్కట్ల పాలయ్యారని, ఈ నేపథ్యంలో, తన వంతు అండగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.1 కోటి విరాళం అందించానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆప్యాయంగా స్వాగతించిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
Pawan Kalyan
Revanth Reddy
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News