AP High Court: ఇది హనీ ట్రాప్: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

satyavedu mla koneti adimulam petition in ap high court to dismiss the case of sexual harassment
  • ఎమ్మెల్యేపై టీడీపీ మహిళా నేత లైంగిక వేధింపుల ఆరోపణలు
  • ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
  • లైంగిక వేధింపుల కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్  
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఇటీవల అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పార్టీ అధిష్ఠానం ఆయనను సస్పెండ్ చేయడం, ఆ తర్వాత ఆయన‌పై పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోనేటి ఆదిమూలం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 

తనపై చేసిన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ప్రాధమిక విచారణ లేకుండా, ఆరోపణల్లో నిజానిజాలపై దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. జులై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఇప్పుడెందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన హనీ ట్రాప్ గా ఎమ్మెల్యే ఆదిమూలం అభివర్ణించారు. 72 సంవత్సరాల వయసు ఉన్న తనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో గుండెకు స్టెంట్ వేయించుకున్నట్లు క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. 
 
కాగా, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఇటీవల టీడీపీ మహిళా నేత లైంగిక ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయింది. ఆదిమూలంపై పార్టీ అధిష్ఠానంకు ఫిర్యాదు చేయడంతో పాటు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు సంబంధించి పెన్ కెమెరాతో రికార్డు చేసిన దృశ్యాలను సాక్ష్యాలుగా ఆ మహిళా నేత బయట పెట్టారు. ఎమ్మెల్యే ఆదిమూలం తనను హోటల్ రూమ్‌కు పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళా నేత మీడియా ముందు చెప్పారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో పక్క ఆ మహిళా నేత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
AP High Court
MLA Koneti Adimulam
TDP
Satyavedu

More Telugu News