Revanth Reddy: కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పేరు మార్చాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం

Revanth Govt changed Koti Womens University name
  • విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడతామని రేవంత్ ప్రకటన
  • ఐలమ్మ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న సీఎం
  • ఐలమ్మ మనవరాలిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నామని ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడతామని సీఎం రేవంత్ ప్రకటించారు. 

ఈరోజు రవీంద్రభారతిలో జరిగిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిదని చెప్పారు. ఆమె స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.

భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలో చాకలి ఐలమ్మ తనుకు స్ఫూర్తి అని చెప్పారు. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నామని సీఎం ప్రకటించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో ఐలమ్మ కుటుంబ సభ్యులను రేవంత్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
Revanth Reddy
Congress
Chakali Ilamma

More Telugu News