నాకు యాక్సిడెంట్ అయింది: రష్మిక మందన్న
- గత నెలలో తనకు యాక్సిడెంట్ అయిందన్న రష్మిక
- డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నానని వెల్లడి
- రేపు అనేది ఉంటుందో లేదో.. హాపీగా జీవించండని సూచన
గత నెలలో తనకు చిన్న యాక్సిడెంట్ అయిందని రష్మిక వెల్లడించింది. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పింది. త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటానని తెలిపింది. రేపు అనేది ఉంటుందో లేదో తెలియదని... అందుకే హ్యాపీగా జీవించండి అని ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. 'ఇంకొక అప్టేడ్ ఏమిటంటే... లడ్డూలు బాగా తింటున్నా' అని రష్మిక తెలిపింది.