KTR: రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: కేటీఆర్

KTR fires on Rahul Gandhi
  • ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కేటీఆర్
  • పార్టీ ఫిరాయింపులు జరిగిన అన్ని చోట్ల ఉప ఎన్నికలు వస్తాయని వ్యాఖ్య
  • దానం, కడియం, తెల్లం పదవులు ఊడటం ఖాయమన్న కేటీఆర్
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని చెప్పారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుల పదవులు ఊడటం ఖాయమని అన్నారు. పార్టీ ఫిరాయింపులు జరిగిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని... ముందు నుంచి కూడా తాము ఇదే విషయాన్ని చెపుతున్నామని అన్నారు. 

రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అన్ని కోర్టుల్లో, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని అన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉందని విమర్శించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు.
KTR
BRS
Congress

More Telugu News