Chinthapally Agency: చింతపల్లి ఏజెన్సీలో విరిగిపడ్డ కొండచరియలు.. పలువురి గల్లంతు

Landslides In Chinthapally Agency in Alluri District
  • ఆంధ్రప్రదేశ్ లోని జీకే వీధి మండలంలో ఘటన
  • ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో గిరిజనుల ఇళ్లపై కూలిన మట్టి, రాళ్లు
  • నలుగురిని కాపాడిన గ్రామస్తులు
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఆదివారం రాత్రి ఘోరం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ప్రాంతంలో గిరిజనుల ఇళ్లపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు ఇళ్లమీద పడ్డాయి. దీంతో కొన్ని ఇళ్లు ధ్వంసం కాగా పలువురు గల్లంతయ్యారు. జీకే వీధి మండలం చట్రాపల్లిలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులను గ్రామానికి పంపించామని ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, సీలేరు ఘాట్ రోడ్ లోనూ కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.
Chinthapally Agency
Andhra Pradesh
Alluri District
Landslides

More Telugu News