Team India: బంగ్లాదేశ్ తో తొలి టెస్టుకు టీమిండియా ఎంపిక

Team India for 1st test against Bangladesh announced
  • టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్
  • ఈ నెల 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు
  • రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మందితో జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ నెల 19 నుంచి జరిగే తొలి టెస్టుకు టీమిండియాను ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ నేడు వెల్లడించింది. 

కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగనున్నాడు. దేశవాళీ పోటీల్లో విశేషంగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కు టీమిండియాలో స్థానం లభించింది. డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి టీమిండియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా కొనసాగనున్నాడు. 

వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ లకు జట్టులో స్థానం లభించింది. ఇక, లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్ తొలిసారిగా టీమిండియాకు ఎంపిక కావడం విశేషం. 

కాగా, ఈ సిరీస్ లో తొలి టెస్టు చెన్నైలో జరగనుండగా, రెండో టెస్టు కాన్పూర్ లో జరగనుంది.
Team India
Bangladesh
First Test
Chennai
BCCI

More Telugu News