ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఎన్నిక

TDP MP Kesineni Chinni elected as ACA new president
  • ఆంధ్రా కికెట్ అసోసియేషన్ కు కొత్త పాలకవర్గం
  • ఉపాధ్యక్షుడిగా పీవీఆర్ ప్రశాంత్
  • కార్యదర్శిగా సానా సతీశ్ బాబు
  • సంయుక్త కార్యదర్శిగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ఆంధ్రా క్రికెట్ సంఘంలో నూతన కార్యవర్గం కొలువుదీరింది. ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఉపాధ్యక్షుడిగా పి.వెంకటరమణ ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీశ్ బాబు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, అసోసియేషన్ ట్రెజరర్ గా దండమూడి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల ఫలితాలు వెల్లడించారు.

గత ఐదేళ్లుగా ఏసీఏ కార్యకలాపాలు తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, స్టార్ ఆటగాడు హనుమ విహారి ఆంధ్రా జట్టు కెప్టెన్సీ కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులు రాష్ట్ర క్రికెట్ లో కలకలం రేపాయి.

ఆంధ్రా క్రికెట్ సంఘంలో కొత్త పాలకవర్గం వచ్చిన నేపథ్యంలో, హనుమ విహారి మళ్లీ దేశవాళీ క్రికెట్లో ఆంధ్రా జట్టుకు సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు విహారికి గతంలో కూటమి నేతలు భరోసా ఇచ్చారు.
Go Back to Shorts
Kesineni Chinni
President
ACA
Andhra Pradesh

More Telugu News