Chiranjeevi: మెగాస్టార్ సర్‌ప్రైజ్.. కంట్రీ డిలైట్ యాడ్‌లో మెరిసిన చిరంజీవి.. వీడియో ఇదిగో

Megastar Chiranjeevi Acted in Country Delight Company advertisement
మెగాస్టార్ చిరంజీవి నటనను ఇష్టపడనివారు దాదాపు ఉండరు. తెలుగు రాష్ట్రాలే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే చిరు ఫ్యాన్స్ ఆయన నటనను సినిమాల్లోనే వీక్షిస్తుంటారు. ఎందుకంటే ఆయన ప్రకటనల్లో అరుదుగా కనిపిస్తుంటారు. అయితే ఇటీవల ‘కంట్రీ డిలైట్’ యాడ్‌లో ఆయన మెరిశారు.

తన మార్క్ నటనతో చిరంజీవి ఈ యాడ్‌లో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా మాస్ కాంబో నుంచి మాస్ కమర్షియల్ యాడ్ అంటూ అభిమానులు  మురిసిపోతున్నారు. కాగా ‘కంట్రీ డిలైట్’ రూపొందించిన ఈ యాడ్‌లో చిరంజీవి నటించగా డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇదిగో ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

Chiranjeevi
Country Delight
Movie News
Viral News

More Telugu News