Mukesh Ambani: అంబానీ నివాసంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు.. వీడియో ఇదిగో

Mukesh Ambani family marked Ganesh Chaturthi with grand celebrations at their residence Antilia In Mumbai

  • తొలిసారి జంటగా వేడుకల్లో పాల్గొన్న అనంత్-రాధిక నూతన దంపతులు
  • ముంబైలోని తమ నివాసంలో వినాయకుడి విగ్రహం ప్రతిష్టాపన
  • ముఖ్య అతిథులుగా పాల్గొన్న సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ దంపతులు

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది తమతమ ఇళ్లలో సందడిగా వేడుకలు జరుపుకున్నారు. దేశంలో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన ముకేశ్ అంబానీ కుటుంబంలో కూడా గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరిగాయి. దక్షిణ ముంబైలోని యాంటిలియా నివాసంలో కుటుంబ సభ్యులు గణేశ్ చతుర్థిని ఘనంగా నిర్వహించారు. నూతన వధూవరులు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ దంపతులు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లైన తర్వాత వారు జరుపుకున్న తొలి గణేశ్ చతుర్థి ఇదే కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. 

ఘనంగా జరిగిన వేడుకల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ, ముకేశ్ తల్లి కోకిలాబెన్, కూతురు ఇషా అంబానీ, అనంత్ అంబానీతో పాటు అనిల్ అంబానీ కుటుంబ సభ్యులు, పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. తమ ఇంట్లోకి వినాయకుడి విగ్రహాన్ని తీసుకొస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు అందరూ భక్తితో స్వాగతం పలికారు. ప్రతి ఏడాది మాదిరిగానే విశేష పూజలు చేశారు. ఉదయం 11:30 గంటల సమయంలో గణేశ్ విగ్రహాన్ని యాంటిలియా గ్రాండ్ లాబీలో ప్రతిష్టించారు. 

‘యాంటిలియా చా రాజా మోరియా’ పేరిట నిర్వహించిన ఆశీర్వాద కార్యక్రమానికి నటుడు సైఫ్ అలీ ఖాన్‌, ఆయన భార్య కరీనా కపూర్ విచ్చేశారు. నటుడు అర్జున్ కపూర్, బి. ప్రాక్ కూడా పాల్గొన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ముంబైలోని లాల్‌బాగ్‌ రాజాకు (వినాయకుడు) రూ. 15 కోట్ల విలువైన 20 కిలోల బంగారు కిరీటాన్ని ముకేశ్ అంబానీ కుటుంబం అందించింది. ఈ కిరీటాన్ని తయారు చేయడానికి 2 నెలల సమయం పట్టింది.

Mukesh Ambani
Anant Ambani
Radhika Merchant
Viral News
Vinayaka Chavithi
  • Loading...

More Telugu News