Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బి. మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud appointed as President of Telangana PCC
  • ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
  • జులై 7తో ముగిసిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీ కాలం
  • పీసీసీ కోసం పోటీ పడిన సీనియర్ నేతలు మధుయాష్కీ, బలరాం నాయక్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది.

దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది.
Mahesh Kumar Goud
Congress

More Telugu News