Kashmir: ఐఆర్ సీటీసీ ఆరు రోజుల అందమైన టూర్... వివరాలు ఇవిగో!

irctc package to visit kashmir at low cost check details in telugu
  • కశ్మీర్ వెళ్లే పర్యాటకులకు ఐఆర్ సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ
  • ప్యారడైజ్ ఆన్ ఎర్త్ – కశ్మీర్ ఎక్స్ బెంగళూరు అనే పేరుతో రౌండ్ ట్రిప్ 
  • బడలిక లేకుండా విమానంలో వెళ్లి కశ్మీర్ అందాలను ఆస్వాదించే సదుపాయం
దేశ, విదేశాల్లోని పర్యాటకులు ఎక్కువగా సందర్శించాలనుకునే ప్రాంతం కశ్మీర్. ఎందుకంటే .. అక్కడి అందమైన లోయలు, మంచు పర్వతాలు, ఎత్తయిన చెట్లు, వాతావరణం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయి. పర్యాటకుల స్వర్గధామంగా కశ్మీర్ ను పేర్కొంటుంటారు. సినిమాల్లో కనువిందు చేసే సుందర కశ్మీరాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందించాలనుకునే పర్యాటక ప్రేమికుల కోసం ఐఆర్ సీటీసీ ఆరు రోజుల అందమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి ప్యారడైజ్ ఆన్ ఎర్త్ – కశ్మీర్ ఎక్స్ బెంగళూరు అనే పేరు పెట్టింది. బెంగళూరు నుండి కశ్మీర్ వరకు రౌండ్ ట్రిప్ విమాన ఏర్పాట్లు చేసింది. పర్యాటకులు ఎటువంటి బడలిక లేకుండా చక్కగా విమానంలో వెళ్లి కశ్మీర్ అందాలను ఆస్వాదించవచ్చు. 

ఆరు రోజుల అందమైన టూర్ ప్యాకేజీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..ఐదు రాత్రులు, ఆరు ఆరు రోజుల పర్యటన. ప్యాకేజీలో భాగంగా బెంగళూరు నుండి కశ్మీర్ వరకు రౌండ్ ట్రిప్ విమాన ఏర్పాట్లను భారతీయ రైల్వేకి అనుబంధ సంస్థ అయిన ఐఆర్ సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్) చేసింది. టూర్ లో భాగంగా శ్రీనగర్, పహల్గాం, గుల్మార్గ్, సోన్‌మార్గ్ తదితర అందమైన ప్రదేశాలను వీక్షించవచ్చు. అల్పాహారం, రాత్రి భోజనం, హోటల్ వసతి, ప్రయాణానికి క్యాబ్ సేవలతో పాటు ప్రయాణ బీమా కూడా ప్యాకేజీలోనే ఉన్నాయి. 

ఈ టూర్ ప్యాకేజీ ధర: ఒక్కరే అయితే రూ.59,700లు ఖర్చు అవుతుంది. అయితే ఇద్దరు వ్యక్తులు కలిపి ప్లాన్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.47,900 మాత్రమే పడుతుంది. కశ్మీర్ ను చూడాలనుకునే వారు ముందుగా ఐఆర్ సీటీసీ వెబ్ సై ట్ ను సందర్శించి, దానిలో బుక్ నౌ ఎంపికపై క్లిక్ చేస్తే ప్యాకేజీ వివరాలు కనిపిస్తాయి. మరింత సమాచారం కొరకు 90031 40699, 85959 31291 నంబర్‌లను సంప్రదించవచ్చు.    
Kashmir
tour Package
IRCTC

More Telugu News