ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం... పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్!
- కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- అక్టోబర్ 14వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు అవకాశం
- ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా, తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు
ఆన్ లైన్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు ఎస్ఎస్‌సీ వెల్లడించింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా, తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సాయుధ బలగాల (సీఆర్పీఎఫ్) తో పాటు ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ (రైఫిల్ మ్యాన్) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు.
పూర్తి వివరాల కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి