పోలీసులపై కోల్ కతా వైద్యురాలి పేరెంట్స్ సంచలన ఆరోపణలు
- కేసును నీరుగార్చేందుకు తమకు డబ్బులు ఇవ్వజూపారని వెల్లడి
- మృతదేహాన్ని చూపించేందుకు చాలాసేపు వెయిట్ చేయించారని ఫైర్
- కోల్ కతాలో బుధవారం రాత్రి నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న వైద్యురాలి పేరెంట్స్
మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలిస్తున్నపుడు కూడా తమను పోలీస్ స్టేషన్ నుంచి కదలనివ్వలేదని మండిపడ్డారు. కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగిస్తూ ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ డబ్బులు ఆఫర్ చేశారని, మేం వెంటనే తిరస్కరించామని వైద్యురాలి తండ్రి చెప్పారు. తమ కూతురుకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ఆమెకు న్యాయం జరగాలని జూనియర్ డాక్టర్లు తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో మద్దతుగా తాము పాల్గొన్నామని వివరించారు. ఈ సందర్భంగా నిరసనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దారుణ హత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం జరగాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.