Samantha: హీరోయిన్ సమంతకు గాయం

Samantha injured
  • గాయపడినట్టు స్వయంగా వెల్లడించిన సమంత
  • సూదులతో చికిత్స తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసిన వైనం
  • ఎప్పుడు గాయపడిందనే విషయాన్ని వెల్లడించని సామ్
స్టార్ హీరోయిన్ సమంత గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. యాక్షన్ సీన్ లో గాయపడినట్టు ఆమె తెలిపింది. మోకాలికి అయిన గాయానికి సూదులతో (ఆక్యుపంక్చర్) చికిత్స తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసింది. గాయాలపాలు కాకుండా యాక్షన్ స్టార్ ను కాగలనా? అని ఆమె రాసుకొచ్చింది. 

అయితే ఏ మూవీ షూటింగ్ లో గాయపడింది? ఎప్పుడు గాయపడింది? అనే వివరాలను మాత్రం సమంత వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 'బంగారం' అనే సినిమా ఉంది. ఈ సినిమా షూటింగ్ లోనే ఆమె గాయపడి ఉండొచ్చని సమాచారం. 

చివరిసారిగా ఆమె 'ఖుషి' సినిమాలో కనిపించింది. మరోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
Samantha
Tollywood
Bollywood
Injury

More Telugu News