Telangana: విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

TG government to setup education commission
  • ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ఏర్పాటు
  • చైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు
  • త్వరలో వీరిని నియమించనున్నట్లు వెల్లడి
రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషించనుంది.

చైర్మన్, సభ్యులను త్వరలో నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా ఈరోజు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Telangana
Education
Government

More Telugu News