Siddhu Jonnalagadda: పెద్ద మ‌న‌సు చాటిన యువ హీరోలు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, విష్వక్సేన్

Siddhu Jonnalagadda and Vishwak Sen Pledge INR 30 Lakh and INR 10 Lakh for Andhra Pradesh and Telangana Flood Relief Efforts
  • భారీ వ‌ర్షాల‌తో రెండు తెలుగు రాష్ట్రాలు అస్త‌వ్య‌స్తం
  • వ‌ర‌ద బాధితుల‌కు అప‌న్న‌హ‌స్తం అందిస్తున్న టాలీవుడ్ ప్ర‌ముఖులు
  • త‌మ‌వంతు సాయంగా విరాళాలు ప్ర‌క‌టించిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, విష్వక్సేన్
  • ఇరు రాష్ట్రాల‌కు రూ. 15 ల‌క్ష‌ల చొప్పున డీజే టిల్లు విరాళం
  • రూ. 5 ల‌క్ష‌ల చొప్పున మొత్తం రూ.10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన విష్వక్సేన్
భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాలు అత‌లాకుత‌లమైన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది స‌ర్వం కోల్పోయి నిరాశ్ర‌యుల‌య్యారు. మ‌రికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్ర‌మంలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు ఆప‌న్న‌హ‌స్తం అందిస్తున్నారు. 

ఇరు రాష్ట్రాల వ‌ర‌ద స‌హాయ‌నిధికి భారీగా విరాళాలు అందిస్తూ త‌మవంతు సాయం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యువ హీరోలు సిద్ధు జొన్న‌లగ‌డ్డ (డీజే టిల్లు ఫేమ్), విష్వక్సేన్ ఏపీ, తెలంగాణ వ‌ర‌ద స‌హాయ‌నిధికి విరాళాలు ప్ర‌క‌టించారు. 

సిద్ధు రూ. 15 ల‌క్ష‌ల చొప్పున రెండు రాష్ట్రాల‌కు రూ. 30 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. ఈ సంద‌ర్భంగా డీజే టిల్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక పోస్ట్ పెట్టారు. 

'తెలుగు రాష్ట్రాల‌ను ఇలా వ‌ర‌ద‌లు ముంచెత్త‌డం బాధాక‌రంగా ఉంది. ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇక్క‌ట్లు చూస్తుంటే ఇంకెవ్వ‌రికీ ఇలాంటి ప‌రిస్థితి రాకూడ‌ద‌ని అనిపిస్తుంది. ఈ వ‌ర‌ద‌లు చాలా కుంటుంబాల‌ను క‌ష్టాల్లోకి నెట్టాయి. ఇలాంటి స‌మ‌యాల్లో మ‌నం ఒక‌రికి ఒక‌రు తోడుగా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. 

వర‌ద బాధితులకు నా వంతు సాయంగా రూ. 30 లక్ష‌ల ఆర్థిక స‌హాయాన్ని (ఏపీకి రూ. 15 ల‌క్ష‌లు, తెలంగాణ‌కు రూ. 15 ల‌క్ష‌లు) వ‌ర‌ద స‌హాయ‌నిధికి ప్ర‌క‌టిస్తున్నాను. ఇది కొంత మందికి ఏదో ఒక విధంగా ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని ఆశిస్తున్నాను" అని సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ త‌న పోస్టులో పేర్కొన్నారు. 

అలాగే మ‌రో యంగ్ హీరో విష్వక్సేన్ ఇరు రాష్ట్రాల వ‌ర‌ద స‌హాయ‌నిధికి ఐదు ల‌క్ష‌ల చొప్పున మొత్తం 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌న వంతు సాయంగా రెండు రాష్ట్రాల వ‌ర‌ద బాధితుల‌కు ఈ విరాళం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వెల్ల‌డించారు.   


Siddhu Jonnalagadda
Vishwak Sen Pledge
Telangana
Andhra Pradesh

More Telugu News