Nara Lokesh: రియల్ హీరో పవన్ అన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు: లోకేశ్

Nara Lokesh birthday wishes to Pawan Kalyan
  • నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని పవర్ స్టార్ అయ్యారన్న లోకేశ్
  • ప్రజల అభిమానంతో డిప్యూటీ సీఎం అయ్యారని కితాబు
జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ రియల్ హీరో అంటూ ఈ సందర్భంగా లోకేశ్ కితాబిచ్చారు. 

ఎక్స్ వేదికగా లోకేశ్ స్పందిస్తూ 'రియల్ హీరో పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని పవర్ స్టార్‌గా నిలిచావు. రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగమయ్యావు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు... ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... హ్యాపీ బర్త్ డే పవన్ అన్న' అని ట్వీట్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News