ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
- భారీ వర్షాలతో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య
- ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని పోలీసుల ఆదేశాలు
- వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందంటున్న పోలీసులు
ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. వర్షం పడిన సమయాల్లో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. పనివేళలు ముగిసే సమయానికి రద్దీ ఇంకా ఎక్కువవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే రద్దీ తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి, సహాయక శిబిరాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు ఆదేశించారు.