Narendra Modi: ఏపీలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ

PM Modi talks to Chandrababu on AP flood situations
 
ఏపీలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న వరద సహాయ చర్యలను సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించారు. అందుకు మోదీ స్పందిస్తూ... ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖలను ఆదేశించామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని స్పష్టం చేశామని వెల్లడించారు. తక్షణమే ఆయా శాఖల నుంచి ఏపీకి అవసరమైన సామగ్రి పంపాలని ఆదేశించామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. 
Narendra Modi
Chandrababu
Floods
Andhra Pradesh

More Telugu News