Chandrababu: నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంపై స్పందించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu reacted on Bollywood actress Kadambari Jatwani issue
  • పోలీసులు రాష్ట్ర ప్రతిష్ఠ మంటగలిపారన్న ముఖ్యమంత్రి
  • ప్రమేయం ఉన్న అధికారులు ఏ హోదాలో ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరిక
  • మీడియాతో చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ వ్యవహారంలో పోలీసులు నడుచుకున్న ధోరణిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపారని వ్యాఖ్యానించారు. 

హీరోయిన్‌కు, ఆమె కుటుంబానికి వేధింపుల విషయంలో ప్రమేయం ఉన్న పోలీసులు అధికారులు ఏ హోదాలో ఉన్నా క్షమించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. శుక్రవారం నాడు మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విద్యార్థులు అందరి సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేపట్టామని, ఎలాంటి పరికరాలు దొరకలేదని ఆయన వెల్లడించారు. 

కొన్ని ప్రచారాల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రచారం పట్ల విద్యార్థులు అందరూ భయాందోళనలకు గురయ్యారని, సమాచారం తెలిసిన వెంటనే అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చంద్రబాబు వివరించారు. 

నేరానికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం విడిచిపెట్టబోదని వార్నింగ్ ఇచ్చారు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu
Kadambari Jatwani
Andhra Pradesh
Bollywood

More Telugu News