Nara Lokesh: బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఘ‌ట‌న‌.. విచార‌ణ‌కు మంత్రి లోకేశ్ ఆదేశం

Minister Nara Lokesh on Hidden Camera in Ladies Hostel
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల కలకలం సృష్టించిన విష‌యం తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా బ‌య‌ట‌ప‌డింది. ఈ ఘ‌టన‌పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై అధికారుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు మంత్రి తెలిపారు. త‌ప్పు చేశార‌ని తేలితే దోషులు, బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. కళాశాల‌ల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లకు ఆదేశించిన‌ట్లు లోకేశ్ చెప్పారు.
Nara Lokesh
Hidden Camera
Ladies Hostel
Andhra Pradesh

More Telugu News