Nara Lokesh: లక్ష కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గతంలోనే అదానీని ఒప్పించాం: నారా లోకేశ్

Chandrababu is a brand says Nara Lokesh
  • చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అన్న లోకేశ్
  • ఏపీకి మళ్లీ పెట్టుబడిదారులు వస్తున్నారని వ్యాఖ్య
  • వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా భూములను ఆక్రమించారని విమర్శ
ఏపీలో ప్రజా పాలన వచ్చిందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అని... ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడిదారులు వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గతంలోనే అదానీని ఒప్పించామని... అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా భూములను ఆక్రమించారని... ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో త్వరలోనే వివరాలతో సహా చెపుతామని లోకేశ్ అన్నారు. విశాఖలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని... భూములు లాక్కున్నారని, కిడ్నాప్ లు చేశారని మండిపడ్డారు. దసపల్లా భూములను లాక్కున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలకు కట్టుబడి ఉన్నామని... అయితే, అన్నింటినీ నెరవేర్చడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని అన్నారు.
Nara Lokesh
Telugudesam
Chandrababu
YSRCP

More Telugu News