KCR: ఫాంహౌస్ లో తీవ్ర భావోద్వేగం... కవితను ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్

KCR hugs his daughter Kavitha and gets emotional
  • బెయిల్ పై తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత
  • ఫాంహౌస్ లో తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత
  • కవిత రాకతో కోలాహలంగా ఫాంహౌస్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు ఐదున్నర నెలల పాటు ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో గడిపారు. నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్న కవిత ఈరోజు ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో తన తండ్రి పాదాలకు నమస్కరించి, ఆయన చేతికి ముద్దు పెట్టారు. కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్... ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. కూతురును చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. ఈ సందర్భంగా కవిత భర్త అనిల్, కుమారుడు కూడా అక్కడ ఉన్నారు. 

కవిత రాకతో ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ కోలాహలంగా మారింది. 10 రోజుల పాటు ఫాంహౌస్ లోనే కవిత విశ్రాంతి తీసుకోనున్నారు. బెయిల్ పై కవిత విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. మరోవైపు తనను కలిసేందుకు ఎవరూ ఫామ్ హౌస్ కు రావద్దని కవిత విన్నవించిన సంగతి తెలిసిందే.
KCR
K Kavitha
BRS

More Telugu News